STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

మా సుబ్బరాయుడు

మా సుబ్బరాయుడు

1 min
406


సుబ్బరాయని గొల్చిన శుభముకలుగు 

నాగదేవత రూపమై నడచి వచ్చి

భక్త జనములఁగాపాడి బలము నిచ్చు

స్వామి కిత్తును బ్రణతితో వందనములు 


చిన్న శిశువులఁ బ్రోచెడి కన్నతండ్రి

పుట్టలో పాలు పోసిన పుణ్యమిడుచు 

సర్పరూపమై నిలుచుండి జగతిమోయు

స్వామి కిత్తును హారతుల్ సంతసముగ.


ఫణికి పూజలు సేయంగ పాపముడుగు

చీడపీడలఁ దొలఁగించి శ్రేయమొసగు

కన్నె వధువుల కళ్యాణ కారకుండు

సంతు నిచ్చెడి నాగయ్య జయము కోరి

స్వామి కిత్తును ఫలములన్ సమధికముగ.


షష్టితిథియందు జన్మించి సత్త్వ గుణుడు 

తల్లి పార్వతి తనయుడై తరలి వచ్చి

జగతి నేలెడి సుబ్బయ్య సర్పదోష

ములను దొలఁగించి మనకిడు పుణ్య నిధిని.//


Rate this content
Log in

Similar telugu poem from Classics