మా అదృష్టం మాది మా ఆనందం మాది
మా అదృష్టం మాది మా ఆనందం మాది
ఎవరు ఉందన్నా... లేదన్నా ... మా అదృష్టం మాకుంది!!
మీరు అవునన్నా.. కాదన్నా.. మా ఆనందం మాకుంది!!
విరిగిన పలకా...చిరిగిన చొక్కా...
నలిగిన క్రాఫూ... నలుగురు ఫ్రెండ్సు
ఐదు పైసల ఆరెంజ్ బిళ్ళలు...
పది పైసల ఐసు ఫ్రూట్లు ...
ఎవరు ఉందన్నా... లేదన్నా ... మా అదృష్టం మాకుంది!!
మీరు అవునన్నా.. కాదన్నా.. మా ఆనందం మాకుంది!!
నూనూగు మీసాలు... నూతన కండలు...
బుట్ట క్రాఫ్ ల బడాయిలు.... ఫ్యాంటుల కోసం ఇంట్లో పాట్లు..
ముసి ముసి నవ్వుల అర్థాలు... తెలిసే తెలియని అగచాట్లు..
నూతన పరువపు సింగారాలు...
సన్న జాజులు, బొద్దు మల్లెలు ... అంది అందని అందాలు..
ఎవరు ఉందన్నా... లేదన్నా ... మా అదృష్టం మాకుంది!!
మీరు అవునన్నా.. కాదన్నా.. మా ఆనందం మాకుంది!!
వలపుల వయ్యారాలు... పరిచయాల ప్రేమలేఖలు...
నాదంటే నాదని కొట్లాటలు .... విరహాలూ వైరాగ్యాలు
పరీక్షల ఫలితాలు... మార్చీ సెప్టెంబర్ దండయాత్రలు...
ఎవరు ఉందన్నా... లేదన్నా ... మా అదృష్టం మాకుంది!!
మీరు అవునన్నా.. కాదన్నా.. మా ఆనందం మాకుంది!!
ఉద్యోగం లేదని ఈసడింపులు...
మొదటిషో చూడాలని కుమ్ములాటలు...
పోస్ట్ మాన్ కై ఎదురుచూపులు ....
ప్రభుత్వోద్యోగం బడాయిలు....
ఫస్ట్ సాలరీ సంతోషాలు....
అమ్మాయిల తలితండ్రుల ప్రాకులాటలు....
ఎవరు ఉందన్నా... లేదన్నా ... మా అదృష్టం మాకుంది!!
మీరు అవునన్నా.. కాదన్నా.. మా ఆనందం మాకుంది!!
పెళ్లి చూపులు, పెళ్లి కార్డులు
ఓర చూపులు .. పాల పొంగులు…
కౌగిలింతలు....పురిటి నొప్పులు...
స్కూళ్లు చదువులు .. ఉద్యోగాలు సేటల్ మెంట్లు
ఎవరు ఉందన్నా... లేదన్నా ... మా అదృష్టం మాకుంది!!
మీరు అవునన్నా.. కాదన్నా.. మా ఆనందం మాకుంది!!
తెల్లటి కేశాలు, పెన్షన్ డబ్బులు,
పార్క్ బెంచీలు....ఫ్రెండ్స్ పార్టీలు ..
థర్టీ ...సిక్స్టీ... వైనూ... విస్కీ ....
కిట్టీ ఫ్రెండ్సు... టూర్లు షికార్లు..
ఎవరు ఉందన్నా... లేదన్నా ... మా అదృష్టం మాకుంది!!
మీరు అవునన్నా.. కాదన్నా.. మా ఆనందం మాకుంది!!
టైమయిపోయి... ఆయువు తీరి
పద పద "పైకని" పిలుపొస్తే ...
నువ్విచ్చిన అదృష్టంతో ఆనందంతో
రంభ ఊర్వశి మేనక డాన్సుల ఆశలతో
పోదాం పోదాం పైపైకి ... స్వర్గారోహణ పర్వం కి