ఏడేడు కొండలు మాకేమి లెక్ఖా
ఏడేడు కొండలు మాకేమి లెక్ఖా
నా తోడన శ్రీనివాసుడు నను నడిపింపగా
ఎదలోని దేవుడే ఎదురుపడతానంటే
ఏడేడు కొండలు మాకేమి లెక్ఖా
దారిచూపేవాడు దరిజేర్చువాడు
మారేడు మాస్వామి మా చెంత నుండ
ఏడేడు కొండలు మాకేమి లెక్ఖా
వడ్డి కాసులవాడు వకుళమాత సుతుడు
వనమాలిగా మారె మా వెంకటేశ్వరుడు
ఏడేడు కొండలు మాకేమి లెక్ఖా
చింత దీర్చేవాడు చిద్విలాసుడు
చిరుతలు భయమన్న చెంత నిలచేవాడు
చింతలైననేమి చిరుతలైననేని
చిన్మయానందుడు మా చెంతనుంటే
ఏడేడు కొండలు మాకేమి లెక్ఖా
