హర విలాసము
హర విలాసము
కలగంటి కలగంటి కైలాస శిఖరాన హరుని గంటి
ప్రమథ గణ పరివేష్టితుని పార్వతీ సమేతుని
అర్ధనిమీల నేత్రుని అర్ధనారీశ్వరుని
నింగి చత్రము క్రింద నిఠలాక్షుని నీలకంఠుని
కలగంటి కైలాస శిఖరాన హరుని గంటి, హర విలాసముని గంటి
డిం డిం... డిం డిం...ఢమరుక ధ్వనులతో
ఝుం ఝుం....ఝుం ఝుం ... మంజీర శ్రుతులతో
తకధిమిత ... తకధిమిత...నృత్య భంగిమలతో
నంది నారద బృంగి స్త్రోత్రాలతో
హస్సెరభ శరభ ప్రమథ గణ తాండవం
ఉమా సహిత ఆదియోగి రుద్ర తాండవం
నలుదిక్కులు పిక్కటిల్లె ఆనంద శివతాండవం
కలగంటి కైలాస శిఖరాన హరుని గంటి, హర విలాసముని గంటి
