కరిగిపోయే కలం
కరిగిపోయే కలం
అసంఖ్యాక నక్షత్రాలు ఒక ఆకాశం
క్షణం క్షణం మారిపోతున్న అంకెలు
కరిగిపోతున్న కాలం
అడుగు
అడుగు
వేసుకొని
పాఠం
పాఠం
నేర్చుకొని
స్వప్నం
స్వప్నం
అల్లుకొని
తలెత్తి
నిల్చొని
నడిచి
పరిగెత్తి
పోరాడి
దూరాలు సాధించి
పాటలు పాడి
చేతులు కలిపి
కొవ్వొత్తులు పట్టుకొని
కన్నీళ్ళు తుడిచి
చిన్న చిన్న
చిరునవ్వులు
మొహంలో పూయించి
ఆవేశాన్ని వెలిగించి
సూర్యుడిలా మార్చి
నువ్వే చెప్పు
పుట్టిన దగ్గరనుంచీ
నేటి వరకూ
నడిచిన దూరమెంత
ఎన్ని పాద ముద్రలు
ఎన్ని యాత్రలు
ఎన్ని యాతనలు
ఎంత ఆహారం తిన్నావు
ఎన్ని లీటర్ల నీరు తాగావు
ఎన్ని దారులు నడిచావు
ఎంతమందితో సంభాషించావు
ఎందరు కోప్పడ్డారు
ఎందరు చేతులు కలిపారు
ఎందరు నవ్వారు
ఎందరు అవమానించారు
చేతి వాచీ మొహం
ఎన్ని సార్లు చూసావు
ఎవరైనా చెప్పగలరా
లెక్క పెట్ట లేనిది
నిర్వచనానికి లొంగనిది
పరిమితం కానిది
అనవరతం వెలిగేది
అమూల్యం
అనంతం
జీవితం
సంభ్రమజనితం
ఆకాశం
అసంఖ్యాక నక్షత్రాలు
పూర్వీకులు
తాతలు
తండ్రులు
మహా వీరులు
రాజులు
చక్రవర్తులు
యోధులు
సంస్కర్తలు
విప్లవకారులు
సామాన్యులు
నీలాంటి
నాలాంటి
సగటు జీవి
అనుభవ జ్యోతులు
సుకీర్తి దీపాలు
మెరుస్తున్నాయి
మిణుకు మిణుకుమని
నీవైపే చూస్తున్నాయి
నీదీ ఒక మార్గం స్రుష్టించు
నీదీ ఒక అనుకంపన కలిగించు
నువ్వూ ఒక తారకవు కా
