కలవరమో....
కలవరమో....
ఓ మనసా...
ఏ పొరపాటో ఏమరపాటో ఊహించని చిత్రం గీసే
ఏ తడబాటో ఏ గ్రహపాటో ఉరి అంచున వేలం వేసే
ఉనికిని చాటే ఆరాటం ఊపిరి కోలాటం ఏ ప్రశ్నకి బదులో తెలుసా
రేపటి పూటే పోరాటం బ్రతుకులో జంజాటం
వినుమిణుగు మిణుగురులా మెరిసే ఆశల ఉబలాటం
కలవరమో కనికరమో అభినయమో అనుభవమో
ఆ దైవం ఆడించే జూదాలే కోరికలే నీ రాత మార్చే విధాతే లేడు
నీ వెంట నడిచే నీడే యమతాడు గతముని తెగ తెంచిన నిజముకి తలవంచిన
తొలకరి స్నేహం తగువుతో విడిచి ముసురున మునకే తప్పే కదా
పలకని పైకం పరుపున పరిచి యదసడి మరుపే ముప్పే కదా...

