కాటుక అద్దిన కళ్ళు
కాటుక అద్దిన కళ్ళు
కాటుకను అద్దిన కళ్ళతో
సన్నజాజి మళ్లేల
పరిమళాలు వెదజల్లుతూ వెళ్ళవు
ఆ పరిమళాల సువాసనను
ఆస్వాదిస్తూ ... నీ మైకంలో...
దారిపొడవునా మన మాటల
మూటలను విప్పుతూ
నీ దరిచేరే దారిలో నేను .
నీవు నా కోసం వదిలివెళ్లిన
కొంటె చూపులను
సుగంధ పరిమళాలను
మైమరపించే మాటలను
వేటిని కూడా వదలకుండా
అన్నీ నాలోనే నింపుకొని
నిన్ను చేరడానికై
నీలో లీనమవ్వడానికై
ఆతృతతో ... నీవైపే
నా పయనం