జ్వాల
జ్వాల
విశ్వమైత్రి యజ్ఞానికి..సమిధకదా
నిత్యప్రేమ వనంలోకి..బాటకదా
గుండెకోత జరగకుండ..తెలిసేనా జన్మవిలువ..
మౌనమైన అమృతహృదయ..జ్వాలకదా
విచక్షణను పండించే..చేను చూడు మనసనేది..
సమభావన పెంచగల్గు..పాటకదా
స్వర్గంతో పనేముంది..విరహం నీ నేస్తమైన..
ఒక "గాలిబ్" మదిలోయల..ఊటకదా
గగనాలను దాటేసిన.."దాశరథి"కి ఏమివ్వను..
చూపలేని అక్షరాల..బొమ్మకదా