జరగాలిగా
జరగాలిగా
ఆమ్రవనీ రాగాలను..వీడుటయే జరగాలిక..!
హృదయవేణు రవములనే..పట్టుటయే జరగాలిక..!
తుమ్మెదతో కలహించే..పుష్పమెలా వుండగలదు..
చెలునిప్రేమ దీపముతో..చేరుటయే జరగాలిక..!
అడవిగాచు వెన్నెలెంత..అద్భుతమో తెలిసిరెవరు..
కన్నులింటి వనములోన..నిలచుటయే జరిగాలిక..!
ప్రశ్నలెన్ని పుట్టలుగా..గుట్టలుగా ఉన్ననేమి..
చిరునవ్వే జవాబుగా..ఎఱుగుటయే జరిగాలిక..!
మొదలు నరకబడిననేమి..పండ్లిచ్చే చెట్లుకలవు..
హృదయనిధిగ ఉన్న ప్రేమ..పంచుటయే జరగాలిక..!
కబళించే మరణమేది..లేదుచూడు వేరేగా..
ధ్యానసాధనా సుధనే..గ్రోలుటయే జరగాలిక..!

