జీవితం
జీవితం
ఏమని తెలుపను
నా చుట్టూ తాను పరిబ్రమిస్తుంటే
ఏమని తెలుపను
నా నవ్వే తనకు ఆనందంగా ఉంటుంటే
ఏమని అడ్డుకోను నాబాధను తాను అనుభవిస్తుంటే
ఎలా విన్నవించను
వలదు పొమ్మన్నా
కన్నీరు దిగమిoగుతుంటే
నాఅల్లారులన్నీ అడిగి మరీ ఆనందిస్తుంటే
అమ్మలా ప్రేమిస్తూ నాన్నలాగా దండిస్తుంటే
నేను నవ్వుతుంటే నవ్వుతున్నాడు
నేను ఏడుస్తుంటే తాను ఏడుస్తున్నాడు
నన్ను దేవతలాగా పూజిస్తున్నాడు
భయమల్లా ఒక్కటే నేనెళ
్ళిపోతే
తను ఏమయిపోతాడో
అర్ధంకాకుండా ఉండిపోతున్నా
నేను గండు శిలను
నేను ఏ బావోద్వేగానయినా భరిస్తాను
ఎవరున్నా ఎవరూ లేకున్నా
నాలో ఎప్పుడూ చలనం ఉండదు
మనుషుల పట్ల జాలి దయ కరుణ ప్రేమ తప్ప
నేను నాలా ఉండిపోతాను
ఒక జన్మలో రెండూ చూశాను చావు చివరికి అంచులను తాకి వచ్చాను
దేవుడు జాలి పడి ఇచ్చిన ఈరెండవ జన్మను అందరితో సంతోషంగా పంచుకుంటాను.. నేను నాలాగా
ఎప్పటికి ఉండిపోతాను