STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ఓ మనసా

ఓ మనసా

1 min
130


అంతర్మథన భావాలు వివరించలేను ఓ మనసా

మారే అంతరంగ ఇష్టాలు సవరించలేను ఓ మనసా


అన్నీవున్నా అందరిని మెప్పించడం సాధ్యం కాదు

ఎవరి మనసులో ఏముందో కదిలించలేను ఓ మనసా


జీవన పయనంలో ముళ్ళ బాటకూడా దాటావలసి రావచ్చు

సరైన దారి లేదని అందరిని నిందించలేను ఓ మనసా


కాలం నేనున్న స్థానం మారాలి అంటుంది ఏమో 

మారే కాలంతో మనసు చేసే గారడీ అనుసరించలేను ఓ మనసా


అందరి ప్రేమాభిమానం తూచే తూనిక రాళ్ళు ఎక్కడ

మనుషుల్లో వచ్చే స్వార్ధం కనపడదు ఆలోచించలేను ఓ మనసా....


Rate this content
Log in

Similar telugu poem from Romance