STORYMIRROR

Myadam Abhilash

Classics

3  

Myadam Abhilash

Classics

జేబు తడిమే మైత్రి

జేబు తడిమే మైత్రి

1 min
193

పద్యం:

 జేబు తడిమె మైత్రి జగమెల్ల నుండును 

 జేబు వెనక గుండె జూడ గలడ

 గుండె లోని మనసు గుర్తించుడే మైత్రి

 బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!

భావం:

 తల్లీ భారతీ! జేబు తడిమే మిత్రుడు జగము లో ఎక్కడైనా ఎవరికైనా ఉంటాడు. కానీ జేబు వెనక ఉన్న గుండె ను చూడగలడా? గుండె లోని మనస్సును గుర్తించగలడా? ఎవరైతే మిత్రుడి గుండెను గుర్తించి గుండెలోని మనసును అర్థం చేసుకుంటాడో వాడే అసలైన ప్రాణ స్నేహితుడు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics