STORYMIRROR

akhila thogari

Inspirational

4  

akhila thogari

Inspirational

జై జవాన్

జై జవాన్

1 min
623

దేశ సేవ కోసం పోరాడే ఓ వీర సైనికా!

విధి నిర్వహణలో వీర యోధుడా!


ప్రాణాలకు ప్రమాదమని తెలిసి...

భరత మాత బిడ్డవని తలచి..


జీవితాన్ని పనంగా పెట్టీ....

భార్య బిడ్డలని విడిచి పెట్టి... 


కాపు కాస్తున్నావు దేశ సరిహద్దులలో...

కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావు అమ్మని కన్న భారతమ్మనీ.


దేశ రక్షణయే ధ్యేయంగా.... 

ధైర్య సాహసమే ప్రాణ త్యాగంగా...


నెత్తుటి బొట్టునే దేశ బిడ్డల రక్షణగా..

భరతమాత నమ్మిన భారతీయ సైనికుడిగా...


అణువణువునా దేశభక్తి ప్రజ్వలించగా

ఆయుధాలే అభయ నేస్తాలుగా..


ఎరుపెక్కిన ఎండల్లో నలుపెక్కిన సూర్యుడిలా...

అలుపెరగక శ్రమిస్తూ... అస్తమానం కాపు కాస్తు...


శత్రుదేశం దండెత్తగ.... గుండెలు చీల్చి ఎదురొడ్డి

త్రుటిలో తప్పిన బుల్లెట్టు... నీ గుండెలు చిల్చుతు వెళ్ళగా..


చిరునవ్వు చెదరకుండా... వెనకడుగు వేయకుండా...

మాతృ దేశ సేవ కోసం.... మరణానికి ఎదురు నిలిచి..

బరిలోకి దిగావు.... భారతమ్మ ముద్దు బిడ్డ.


క్షతగాత్రుడై నెత్తురొలుకుతు... కొన ఊపిరితో మూర్చపోతు

కళ్ళు బైర్లు కమ్మిన... కడదాక పోరాడుతూ... 

ప్రాణాలు విడిచావు... అమరుడివై నిలిచావు.


మరణాన్ని సైతం తృణ ప్రాయంగా త్యజించిన త్యాగమూర్తి... ఏమిచ్చి తీర్చుకోగలం నీ రుణం.


       


Rate this content
Log in

Similar telugu poem from Inspirational