STORYMIRROR

akhila thogari

Inspirational

4  

akhila thogari

Inspirational

త్యాగధనుడు నాన్న. #MyDadMyHero

త్యాగధనుడు నాన్న. #MyDadMyHero

1 min
445

కడుపున మోయకపోయిన కళ్ళలో పెట్టుకు చూసుకునేది నాన్న.

తన బిడ్డలో తల్లిని చూసుకుని మురిసిపోయేవాడు నాన్న.

బుడి బుడి అడుగులు వేస్తుంటే భుజాన ఎత్తుకుని తిరిగేది నాన్న...

బిడ్డ ముద్దు ముద్దు మాటలకి మురిసిపోయేవాడు నాన్న... 

రాత్రనక పగలనక తన ప్రతి రక్తపు బొట్టును చెమట చుక్కగా చేసి శ్రమించేది నాన్న.

కాయ కష్టం చేసి....ఖర్చులన్నీ అదుపు చేసి..... బిడ్డ కోరికని తీర్చేవాడు నాన్న.

తను తిన్నా తినకపోయిన బిడ్డ కడుపు నిండితే చూసి సంతోషించేవాడు నాన్న.

చేయుతనిచ్చి నడిపించేవాడు నాన్న...

బిడ్డ ప్రతి ప్రయత్నంలో వెన్నంటి ఉండే వాడు నాన్న.

తప్పటడుగు వేస్తే మందలించేవాడు

బిడ్డ జీవితానికి ప్రగతి బాటలు వేసేవాడు నాన్న.

తన అనుభవాలను పాఠాలుగా చెప్పి ముందుకు నడిపేవాడు నాన్న.

తనేలా ఉన్నా తన పిల్లలు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించేవాడు నాన్న.

బిడ్డ ఎదుగదల చూసి సంతోషించేవాడు నాన్న.

బిడ్డ విజయంలో తన విజయాన్ని వెతుక్కునే వాడు...

పరాజయంలో నేనున్నాను అంటు భుజం తట్టేవాడు నాన్న.

తన కాళ్ళ మీద తను నిలబడే వరకు నిరంతరం శ్రమించే శ్రమ జీవి నాన్న.

అటువంటి నాన్నకి శిరస్సు వంచి మనసారా వందనం పాదభినందనం.

     *:*:*:*::*:*:*:*:*:*::*:*:*:*:*:*:*:*

                       ధన్యవాదాలు



Rate this content
Log in

Similar telugu poem from Inspirational