Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

జాలిలేని జాబిలి

జాలిలేని జాబిలి

1 min
149


జాలిలేని జాబిలికే..మనసిస్తే ఇచ్చానేం..! 

ప్రేమ అనే ఊబిలోన..పడిపోతే పోయానేం..! 


హాయి అనే పదమెందుకు..పనికిరానె రాదీపై.. 

వేదననే మధువులాగ..గ్రోలేస్తే గ్రోలానేం..! 


అసలు లేని కాలానికి..లెక్కలెలా కట్టగలను.. 

యుగాలనే ఓ ప్రక్కకు..నెట్టేస్తే నెట్టానేం..! 


నువ్వెవరో నాకెందుకు..నేనెవరో తెలియనపుడు.. 

నా నేనును నీలోనే..కలిపేస్తే కలిపానేం..! 


నీ ఒడిలో పసిపాపగ..ఉండటమే భాగ్యములే.. 

అమాయికత అనే తోట..పెంచేస్తే పెంచానేం..! 


అక్షరాల మెఱుపుసుధయె..తోడైనది అడుగకనే.. 

నీ ఆనతి తియ్యగనే..మీరకనే మీరానేం..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance