Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

గుండె మంట

గుండె మంట

1 min
329


మండే గుండెల్లో

మాయని గాయాలెన్నో ?


కడలి అలల కల్లోలంలో

తీరంచేరని బ్రతుకునావలెన్నో ?


శిథిలమైన జీవితాల్లో

పదిలమైన జ్ఞాపకాలెన్నో ?


చలించే కాలంలో

ఫలించని జీవితాలెన్నో ?


పొడుస్తున్న ఉదయాలలో

విచ్చుకోని హృదయాలెన్నో ?


ఆశల చీకటిలో

అందరాని వెలుగుపూలెన్నో ?


దైవం రాసినరాతల్లో

చిక్కుకున్నతల రాతలెన్నో ?


కనులు మూసిన రేయికి

తెలవారని బ్రతుకులెన్నో ?


నిస్పృహల నిషీధిలో

నైరాశ్యమొందే దుఃఖితులెందరో ?


పొత్తిళ్ళు కూర్చిన ఆనందంలో

ఒత్తిళ్ళు మిగిల్చిన విషాదలెన్నో ?


నిష్కపట చెమటచుక్కలురాల్చిన 

నిరాశల నులివెచ్చని కన్నీళ్ళెన్నో ?


శిశిరం ముసిరిన జీవితతరువులకు

వసంతం విరియని తనువులెన్నో ?


ప్రశ్న నుండే ఉద్భవించిన ప్రగతి

ప్రశ్నైమిగిలిన జీవితాలకేల ఈ గతి ?

             


‌... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance