Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4.4  

Ramesh Babu Kommineni

Romance

ఎక్కుపెట్టిన చూపులు

ఎక్కుపెట్టిన చూపులు

1 min
232


ఎదురు చూపులు ఎక్కుపెట్టి ఆ ఎదలోనే

కుదురు ఊహలు కుతుహలంతో కదిలేనే

ఎదురు చూపులు ఎక్కుపెట్టి ఆ ఎదలోనే

కుదురు ఊహలు కుతుహలంతో కదిలేనే


మరిచిపోని గుర్తులు మానసంనే చిత్రించి

తరిగిపోని తన్మయం తనూ నియంత్రించి

మది ఉల్లాసం ఊరించే ఆశలు జయించి

నది ప్రవాహమై ఉరికించే కోరికే లయించి

ఎదురు చూపులు ఎక్కుపెట్టి ఆ ఎదలోనే

కుదురు ఊహలు కుతుహలంతో కదిలేనే


గట్టు తెగకనే గహనాలను చేరక మునుపే

ఒట్టు వేసి వడ్డుకే చేర్చవా వేయక మునకే

వలపు వాహకం వదలదు వరస కలపను

తెలప తరమా ఆతెగువనే చేయికలపను

ఎదురు చూపులు ఎక్కుపెట్టి ఆ ఎదలోనే

కుదురు ఊహలు కుతుహలంతో కదిలేనే



రంగుల కలలే ఆ రాజసంతో అరుదెంచెనే

చెంగున చేమంతులన్నీ చెలరేగి ఏతెంచెనే

తోటలోన పాటలన్ళీ పల్లవులూ పలికించే

ఏటిలోన సుడులు వయ్యారాలే వలికించే 

నిండు మనసులూ నికరమైన ప్రేమ నిండి

రెండు హృదయాలే ఒకటైనే వలపు పండి

ఎదురు చూపులు ఎక్కుపెట్టి ఆ ఎదలోనే

కుదురు ఊహలు కుతుహలంతో కదిలేనే


Rate this content
Log in