ఏ కొమ్మలనంటి
ఏ కొమ్మలనంటి
ఏ కొమ్మలనంటిన పూలో అందంగా హసియిస్తూ
స్వాగతం పలుకుతుంటే
ఏ కుంచెతీసుకుని చిత్రించాలి ఆ కుసుమాలను.
ఏ వనమున దాగిన అందాలో నే చూడకపోతే అడవి కాచిన వెన్నెలేకదా ఎలా వర్ణించాలి వాటి అందాలను.
నవ్విన నవ్వులే పలికించిన భావాలే కదా మురిపించేవి మరిపించేవి.
ముద్దులొలుకుతూ ముద్ద పూలు కొమ్మ కొమ్మకూ గుత్తులు గుత్తులుగా గలగలనవ్వే పసిపాపల నవ్వులా.
కొమ్మ కొమ్మకూ అంటించుకున్న ఆ అందాలు వగలుపోతున్న అమ్మాయి సిగ్గులా.
గుంభనంగా నవ్వేవి, మనోహరంగా నవ్వేవి, అరనవ్వులు ఆ విరినవ్వులు.
ఆ పూలసోయగాలను చూస్తూండమే తప్ప కోయలేను
రాలిన వాటిని ఏరుకోవడమే అప్పుడప్పుడూ నీవు రాల్చే ఆ నవ్వుల్లా చూస్తూండమే తప్ప చేతికెత్తుకోలేను
మురిపెముగా... కొన్ని అంతే .

