ఎదలో ఊహలు
ఎదలో ఊహలు
ఊహలన్నీ ఊసులొలికితే ఉప్పెనా ఉలుకలేగా
దాహలన్నీ తీరకపోతే దరి చేరనీకా అలుకలేగా
ఎదనునిండిన కోరికలు ఎడబాటులేక తీర్చుకో
తుదను చేరక తూణీరమై మనసునే మార్చుకో
ఎదలో ఊహలే ఎరుగని సౌఖ్యమే యిచ్చాయి
మొదలే కాని మోహాలకే సుఖాలనూ తెచ్చాయి
కనులలోని కాంతిరేఖలే కధలన్నిటిని చెప్పాయి
తనువులోని తమకమే తహతహలు విప్పాయి...

