దీపాలు
దీపాలు
చిరునవ్వుల దీపాలను..వెలిగిస్తూ ఉండడమే..!
మల్లియలా స్వచ్ఛంగా..జీవిస్తూ ఉండడమే..!
ఏ కోరిక లేక చినుకు..ఏ గింజకు పాలౌనో..
చినుకుపూల తేరులాగ..పయనిస్తూ ఉండడమే..!
ఏ చెట్టుకు ఆశ ఉంది..స్వార్థముంది తెలియవేమి..
నిన్ను-నీవు అనుక్షణం..గమనిస్తూ ఉండడమే..!
ప్రయోజనం కోరు జనం..ప్రలోభాల బానిసలే..
సత్యసంధ నాయకులను..గెలిపిస్తూ ఉండడమే..!
మరి నీతికి న్యాయానికి..కట్టుబడే వారెవరో..
సరిగ తెలిసి ధర్మమేదొ..పాటిస్తూ ఉండడమే..

