STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

దిగువ మనిషి

దిగువ మనిషి

1 min
343


డిగ్రి చేతిలో బట్టిన దిగువ మనిషి 

తాను చదివిన చదువుకు తగ్గ పనులు

దొరక లేకీ గుమాస్తాగ దొరలు చుండి 

బ్రతుకు బండిని లాగుచు వెతలు పొంది

యాలు బిడ్డల పోషించ

నలసి పోయి

ఱెక్కలరిగించి యెముకలు కరగదీసి

పిల్లగాండ్లకు చెప్పించి పెద్ద చదువు

మునిగి పోయినాడు 

చూడరో!మనికి లేక.

ఱెక్క లొచ్చిన పిల్లలు రివ్వు మనుచు

పక్షులై వెళ్లి తమకేమి పట్టనట్లు

చూడ కుండిరి వెనుకకు చోద్య మకట!

ధనము కరిగెను రోగము దాపురించె

యింటి యిల్లాలు గతియించ నొంటి బ్రతుకు 

ముందు ముందు జీవితమున ముక్తి లేక 

బరువు లెన్నియో మోయగా వడలిపోయి 

వృద్దుడైనట్టి మానిసి విసుగు చెంది 

గడుపుచుండనీ వయసున గాసిపడుచు

వేదనా భరితముగనీ బెదురు బతుకు

నీడ్చు చుండెను దిగులుగా నేడ్వలేక

మహిని సాగెను చింతతో మనిషి గాథ

బతుకు జట్కా బండి

వలెను గతుకు లందు

మళ్ళి చివరకు మిత్తితో వెళ్లి పోవు./



Rate this content
Log in

Similar telugu poem from Classics