చూపులు
చూపులు
కొన్ని చూపులు
ముళ్లయి గుచ్చుకుంటాయి
ఇంకొన్ని చూపులు
ప్రేమలై వాటేసుకుంటాయి
మరికొన్ని చూపులు
అసూయలై మండుతుంటాయి
ఇంకా కొన్ని చూపులు
ఆత్మీయతలై అల్లుకుంటాయి
అరుదైన చూపులు మాత్రమే...
జీవితాన్ని తడిమి నీకోసం
అందమైన భవిష్యత్తు చెక్కుతుంటాయి ...!

