కన్నీరు విడుస్తూనే
కన్నీరు విడుస్తూనే
😭 కన్నీరు విడుస్తూనే.. 😭
గాలిలో తేలిక కావాల్సిన దేహాలు
బరువై నేలకు రాలిపోవడం..
కన్నీరు విడుస్తున్నాము సరే
కారణాలు ఎన్నటికైనా తేలుతాయా అని
కంటితుడుపు పరామర్శలు సరే..
ఆత్మీయులను కోల్పోయిన
ఆక్రందనలకు.. ఆవేదనలకు బాధ్యులెవరు?
అంతదాకా ఒక కన్ను అటు వేసే ఉంచాలి
వారెవరైనా..
కన్నుగప్పి జారిపోకుండా చూడాలి
💐 అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు అశ్రు నివాళి 💐
