చలనం- నిశ్బలనం.
చలనం- నిశ్బలనం.
సాగర కెరటమంత చలనం గా నీ ఆలోచనలు (అల్లకల్లోలం గా)
సాగర గర్భమంత నిశ్చలం గా నీ మనసు ఏల సాధ్యం ఎలా సాధ్యం.
సాగర గర్భాన్ని పున్నమి చంద్రుని వెన్నెల
తాకినందుకా అంత నిశ్చింత నిశ్చలనం.
నీ నోట నుండి మాట రాకపోయినా
తనువు నుండి తరంగాలు తాకుతూనే ఉన్నాయి.
నీ నోట మాట పదాల పదనిసలు లయ తప్పవచ్చు
కానీ నీ మనసు సరిగమలు శ్రుతి తప్పవు.
నీ రాతలు రూపాంతరమై భావవ్యక్తీకరణ కాకపోతేనేం
నా హ్రుదయం అనుసంధానమై ఉంది కదా.
నా కనులకు చూడాలని అంటాయి కానీ మనసు మార్గం తెలియదు అంటుంది.
నా మనసు మాట్లాడలని అంటుంది కానీ కంఠం మూగపోతుంది.
ఇక స్వేచ్చగా ఉన్నది ఈ చేయి అందుకే ఇదంతా రాస్తుంది.
బంథంలో జీవమున్నపుడు ఎన్ని బంథనాలున్నా చిరకాలం చిరస్మరణీయమే.
అర్థం నీవు అర్థం కావాలంటే నీ మౌనం చాలు ఈ హ్రుదయానికి
మరి అర్థం నేను అర్థం కావాలంటే చీకటి లో కూడా చూడు
నీడనై నీ నీడనై ఉన్నాను ఆత్మగా.చూడగలుగుతున్నావా కనిపిస్తున్నానా..

