చినుకు వచ్చి తాకింది
చినుకు వచ్చి తాకింది
చినుకొచ్చి తాకింది
మేని పరవసించింది!
మనసెంతో. మురిసింది
బాల్యపు గంతులు వేసింది!
ఉక్కపోత సెగల నుంచి
విముక్తి కలిగింది!
కాశ్మీరం చల్లదనాన్ని
ఊరంతా వ్యపింపచేసింది!
రాతి నేలలో ఏరు పారుతునట్టు
కంకర రోడ్డు మీద నీరు పరుగులు
తీస్తుంది!
బీడు భూమిలో
వరద వచ్చి చేరినట్టు
ఇంటి ముందు వాకిలంతా
చిరు గోదావరి పాయగా
పుణ్య దర్శనం ఇస్తుంది,!
