STORYMIRROR

Susmita Bandi bolimera

Fantasy

5.0  

Susmita Bandi bolimera

Fantasy

అందమైన శీతాకాలం

అందమైన శీతాకాలం

1 min
12

ప్పచ్చని ప్రకృతి ...తెల్లగా మెరిసే మబ్బును పైట లా ధరిస్తే ,

పిల్లగాలి ఆ పైట తో చల్లగా ఆడంగా... పొగమంచై వనమంతా కురిసింది ,

గిజిగాళ్ల కువ కువ లు అందెల సవ్వడై ధ్వనించగా ,

రంగు రంగుల పూలు అడవి సిగను అలంకరించాయి ,

సెలయేరు నిండుగా గల గలా పారంగా ,

ఉషోదయం తో తూరుపు.. సింధూరం అయ్యిన్ది ,

ఆ అందం అంతా నా ఇంటి ముంగిట ముగ్గు అవ్వగా ,

ప్రతి రోజు ప్రొద్దుటే కమ్మటి కాఫీ తో ఎంత చూసినా తనివి తీరదే ,

అప్పుడు చెప్పింది శీతాకాలం చెవిలో చిన్న గా వెళ్లి మళ్ళీ వస్తానని ఇక నువ్వు మురిసింది చాలని ,

ఎన్నో మధుర జ్ఞాపకాలను మదినిండా నింపుకొని ,

చెప్పాను ఇష్ట సఖికి వీడ్కోలు ...అయిష్టంగానే 


Rate this content
Log in

Similar telugu poem from Fantasy