STORYMIRROR

Susmita Bandi bolimera

Inspirational

3  

Susmita Bandi bolimera

Inspirational

సివంగివే

సివంగివే

1 min
163

ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన అందాల భరిణె ,

ఆకాలంలోనే చదువుకున్న

 నీవు.. సివంగివే ,

చిన్న వాయసులోనే భర్తను కోల్పోయినా ,

ధైర్యం వీడక చంటి బిడ్డను చంకనెత్తుకొని ,

బ్రతుకు పోరాటానికై సన్నద్ధమైన 

నీవు ....సివంగివె ,

పుట్టింటి ప్రేమ ,అత్తారింటి ఆదరణ లేక పోయినా ,

ఒంటరి పోరాటం లో ఎవరికీ తలవంచని తత్వం ,

పొగరుమోతుతనమే తనకు రక్షణ కవచం ,

మగరాయుడు అని పిలవబడే ,

నీవు... సివంగివె ,

తెల్లని మేని ఛాయతో ,తేనె రంగు కళ్ళతో ,

అందానికే అందమైన నీవు ,

కన్నీటిని మింగి ,ఆకలికి కురూపివైనా,

 నీవు... సివంగివె 

అన్ని వున్న అమ్మలు అపశకునం అని హేళన చేసిన ,

గుండె బద్దలైనా ,చిరునవ్వు తో సాగే ,

నీవు.... సివంగివె ,

ఎర్ర నర్సమ్మ పురుడని వచ్చినప్పుడు,

ఎండైనా ,వానైనా ,రాత్రయినా ,పగలైనా ,

బిడ్డను చంకనేసుకొని ఊర్లు ,ఊర్లు నడిచివెళ్లి ,

బిడ్డ అడ్డం తిరిగినా సుఖప్రసవం చేసి ,

ఎంతోమంది శిశువుల ,తల్లుల ప్రాణాలు కాపాడిన 

నీవు ...సివంగివె 

కన్నీటిని దిగమింగి ,కష్టాలను ఓర్చి ,

సుఖాలను మాకు వదిలి వెళ్లిన,

 నీవు ....సివంగివె 

ఇటువంటి వారు మీ చుట్టుపక్కల కచ్చితంగా ఎవరో ఒకరు వుంటారు .వారికి సహాయం చేయక పోయినా పర్వాలేదు కానీ వారిని అవమానించకండి .ఎందుకంటే 

వారు బ్రతుకుతో రోజు పోరాడుతూ ..ఓడిపోతూ ,గెలుస్తూ ,ఒక్కోసారి నిరాశతో డస్సిపోతూ ఉంటుంది వారి ప్రయాణం .

పైన కవిత మా అమ్మమ్మ జీవితం .ఆమె కొవ్వొత్తిలా కరిగి మమ్మల్ని మాత్రం ఉన్నతంగా తీర్చిధిదింది .

ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ కవిత ఆమెకు ,ఆమెలా కష్టపడుతున్న మహిళా మణులకు అంకితం 


Rate this content
Log in

Similar telugu poem from Inspirational