చిలిపి ఆశ ...
చిలిపి ఆశ ...
కన్నుల్లో కలలన్నీ… వెన్నెల్లో అలలన్నీ
నీవేగా నావన్నీ… నువ్విక నేనవనీ
గుండెల్లో ఊహల్ని… వేడెక్కే ఊపిరిని
నీ సొంతం చేసెయ్ నీ… తొలి ఏకాంతమనీ..
తనువొక తెల్లకాగితం తెలుసుకోవా
తొలి తొలి తీపి కవితలే రాసుకోవా
మెలికల మేలి మెరుపులో కలిసిపోవా
వలపుల వానధారలో తడిసిపోవా
వయసు ఊపులో చిలిపి ఆశలే
మొదటిసారిగ మదిన పూసెలే
దుప్పట్ల చప్పుళ్లనాపి మన ముద్దు ముచ్చట్లు వింటూ
చుట్టూత చీకట్లు దూకి కౌగిట్ల తలదాచుకుంటూ
అరచేతికే వేళ్ళు అయిదే కదా ఈరోజు మెరిసాయి పదివేళ్ళుగా
మెడవంపునా పెదవంచుతో తడి సంతకం చేయనీ
చిత్రాంగ కలిపింది కాలం ఇష్టాంగా పిలిచింది ప్రాయం
అద్దంలా మారింది దేహం నీ రూపమే దాని బింబం
ముద్రించు మదిలోన నీ జ్ఞాపకం గుర్తుండిపోవాలి ప్రతిక్షణం
నడకాపినా నడిజామునీ మన మధ్య నడిపించనీ....

