STORYMIRROR

kottapalli udayababu

Action Classics Inspirational

4  

kottapalli udayababu

Action Classics Inspirational

chejaarchukunna kshanam💐

chejaarchukunna kshanam💐

1 min
284

💐💐💐💐💐💐💐💐💐💐💐

కలలు జార్చుకున్న క్షణాలు!!!

💐💐💐💐💐💐💐💐💐💐💐💐

బుద్ధికి ఏం పొరలు కమ్ముతాయో తెలీదు.

అప్పుడప్పుడు స్తబ్దమైపోతుంటాను..

ఒంటరితనపు పక్కమీద

అవయవాలు యాంత్రికంగా

విధులు నిర్వర్తిస్తుంటాయి.

ఎవరో వచ్చి ఇల్లంతా

ఆలోచనల కళ్ళాపి చల్లి

తమ ప్రాభవాన్ని చుక్కలముగ్గుగా

పెట్టి వెళ్లిపోతుంటారు...

నేనూ లేవాలని, వారికన్నా

అందమైన రంగవల్లులు

జీవితానికి అడ్డుకోవాలని

ఉవ్విళ్లూరుతున్న అదృశ్యకొలను

కళ్ళముందు నర్తిస్తూనే ఉంటుంది...

అయినా నిశ్చలత్వం,నిరాసక్తత

జోడుగుర్రాల సవ్వారీ చేస్తూ

చచ్చిన మస్తిష్కపు మైదానం మీద...

ఒక అద్భుత సన్నివేశాన్ని కోల్పోయాక

నాకన్నా చిన్నవాళ్ళందరూ

తమ అనుభూతుల పుష్పగుచ్చాలతో

చరుస్తూ భ్రమరాలై తిరుగుతుంటే...

స్తబ్దత పొరలు ఆవిరై సుషుప్తి

నిలువెల్లా ఆక్రమించేస్తుంది.

అపుడు వారి ఆనందపు గులాబీలు ఆస్వాదిస్తుంటే

నేను జార్చుకున్న క్షణాలు

అంకుశాలై మనసుకు గుచ్చుకుంటాయి.

వారిబృందంలో నేను ఒకనిగా అనుకున్నప్పుడు

నాచుట్టూ అన్నీ విరబూసిన కలువలే...!!!

****************



Rate this content
Log in

Similar telugu poem from Action