STORYMIRROR

kottapalli udayababu

Classics Inspirational Others

4  

kottapalli udayababu

Classics Inspirational Others

అమృతకలశం నా మాతృభాష...!!!

అమృతకలశం నా మాతృభాష...!!!

1 min
283

అమృతకలశం నా మాతృభాష...!!!(కవిత)


నవమాసాలూ మోసి...మోసి  

బిడ్డ తన్నులు తీయని తీపు నొప్పులై 

మెలిపెడుతున్నబాధ అశృవులై 

అమ్మ కన్నుల జాలువారుతున్న 

కన్నీటి బిందువుల్లో.............. నా మాతృభాష.. 


తొలి సారి అమ్మ గా ఉన్నతినిచ్చి  

కేర్ మన్న నా స్వర నీరాజనం అందుకుంటూ...

 అమ్మదనపు మార్దవంతో పొదువుకున్న 

అమ్మ స్పర్శలో...................నా మాతృభాష.


చనుబాలు చిట్టి చిట్టి గుటకలుగా 

నాలోకి ప్రవహిస్తున్నప్పుడు 

తేనే తుట్టలా అమ్మ అర్ధనిమీలిత నేత్రాలలో

 ఆత్మైక ఆనందానుభూతి........నా మాతృభాష


ఒళ్ళంతా నలుగుపెట్టి లేతపోట్ట 

డొక్కల్ని అరచేతుల తెడ్ల నొక్కులతో 

స్వచ్చ భారత్ చేసేసి లేత 

కాడల చేతుల్ని...చెరుకుగడల కాళ్ళకు 

సంధానించి ...యోగాసనాలు నేర్పించి 

మసులుతున్న నీళ్ళతో...

మెదడు మర్దన చేస్తూ స్నానింప చేసే 

అమ్మ “ లాల “ లో..................... నా మాతృభాష...


స్నానమానాంతర చర్యలో భాగం గా

 సౌందర్య సాధనాలు నా చుట్టూ చేరి

 తమను అందలమెక్కించే నా నగుమోము న  

లక్కపిడత నోటి గుహలోంచి 

జాలువారుతున్న చొంగ రసంలో............... నా మాతృభాష...


సాంబ్రాణి ఘుమఘుమల పరిమళాల

 మేఘమాలలనుంచి ప్రభవించి  

ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాల అద్దకాలు అద్దుకుని 

మల్లెపూలదారంతో నేసిన శ్వేతవస్త్రాలలో

బయటపడిన నా నుదుట ‘అగులు ‘  

అమావాస్య చంద్రుడు కింది పెదవికింద 

దిష్టి చుక్క చెలియ కన్నుల్లో ................నా మాతృభాష...


ఆకలితో వెక్కుతున్న పేగుల యజ్ఞానికి

 ఆజ్యాన్ని సమాయత్తం చేస్తూ...మాటల లాలనతో 

పాల గిన్నెలు కాల్చిన మచ్చలు 

అందాల చిహ్నాలైన చేతులు పాలపీక 

నోటికందించి తలనిమిరుతూ ఏరేసే 

కన్నీటి ముత్తెపు పిందెలలో...............నా మాతృభాష.


నాద నీరాజనాన్ని మిళితం చేసుకున్న 

ఓంకారపు అమ్మ లాలిపాట – 

అనురాగ రాగాలు మేఘాల డోలికల్లో 

తేలి తేలి వ్యాపిస్తూ వాడవాడలా 

పరిమళించే తీరులో.....................నా మాతృభాష.


చీర ఊయలలో గిలగచ్చకాయల 

చెలికత్తెల చిలిపి వలపు అల్లర్ల మధ్య 

నన్ను దోచుకావాలనుకున్న నిద్రాదేవత 

వొడిలోకి జారిపోతున్న బాలచంద్రుని 

కలువ ముఖబింబపు నిదురలో................. నా మాతృభాష.!!!


                      **************************


Rate this content
Log in

Similar telugu poem from Classics