చైత్ర గీతం
చైత్ర గీతం
ప్రేమపంచే రాగమేదో..పాడుకోగా నేర్పలేవా ..!
నాదమైనా గుండెనంటే..ఎల్లకాలం ఉండలేవా..!
అక్షరాలే పూలజల్లై..రాలుతుంటే సాక్షినయ్యా..
లేఖ వ్రాసే పద్ధతేదో..ఇంతమాత్రం చెప్పలేవా..!
మంత్రమేదో వేసినావా..సిగ్గుతోనే ఆగిపోయా..
నిన్నుచేరే మార్గమేదో..సైగలందే చూపలేవా..!
వేషమేదో వేయలేనే..కాలిమువ్వై మ్రోగనీవా..
నాట్యమాడే శ్వాసలోనే..అల్లుకోగా చూడలేవా..!
చైత్రగీతం ఆలపించే..కోకిలాయే మానసమ్మే..
మోదమైనా ఖేదమైనా..ఎంతసేపో వీడలేవా..!
మోహవీణా తంత్రులందే..చిక్కుకుందే వెర్రిదాహం..
భావమైనా పద్యపాదం..చేరుకోవా పొంగలేవా..!