STORYMIRROR

Midhun babu

Action Thriller Others

4  

Midhun babu

Action Thriller Others

భయం భయంగా

భయం భయంగా

1 min
295

భయం భయంగా

భువిలో బ్రతుకు సాగిపోతోంది !

భూతమొస్తుందని భయం

బాంబులేస్తారని భయం

బాసు తిడతాడని భయం

బువ్వ దొరకదని భయం


ఓటమంటే భయం

ఓడిపోవాలంటే భయం

ఒంటరిగా ఉండాలంటే భయం

ఊపిరి పోతుందంటే భయం!


మనుషులంటే భయం

మృగాలంటే భయం

మరణమంటే భయం

మనుగడంతా భయం!


దొరకదేమోనని భయం

దొరికితే దొంగిలిస్తారేమేనని భయం

అందదేమోనని భయం

అందినా ఉండదేమోనని భయం!


భయం పోవాలంటే

భగవన్నామ స్మరణే మార్గం !

ఆందోళన లేకుండా ఉండాలంటే

ఆత్మ స్తైర్యమే ఆలంబనం !


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More telugu poem from Midhun babu

Similar telugu poem from Action