STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

బాంధవ్యాలు

బాంధవ్యాలు

1 min
19

*బాంధవ్యాలు*

(కవిత )


ఆప్యాయతానురాగాలు అపార్థాల వెల్లువలో మునిగాయి.

అవేశాల పంకంలో అనుబంధాలు సమాధి అయిపోయాయి.

ఉనికి లేని బంధాలను వెదుకులాడి వెదుకులాడి

నీరసించి మనతరం నిస్తేజంతో కన్నీరు కారుస్తోంది.


పాశ్చాత్య పోకడ సమాజంలో పెచ్చరిల్లి హుంకరించింది.

పాఱ ద్రోలటానికి మనకు శక్తి ఎక్కడుంది?

బాధ పడుతూ కూర్చుంటే భవిత నాశమవుతుంది.

చేయి చేయి కలిపితే విజయం సిద్ధిస్తుంది.


పెరుగుట విరుగుట కొరకే యనుట వినలేదా!

కటిక చీకటి దీపకాంతితో తొలిగిపోదా!

ఆత్మీయ బంధాలకు అదే అంకురము కాదా!

మొలకెత్తితే మన కళ్ళముందే మహావృక్షమయిపోదా!


పలకరింపుతో మొదలుపెట్టి పంతాలకు స్వస్తి చెప్పి

ప్రేమామృతం పంచిపెట్టి మచ్చికతో మంచి చెప్పి

బంధుత్వం గుర్తు చేసి గట్టిగా బుద్ధి చెప్పి

మనమే మన భవిష్యత్తును నిల్పుకోవాలి.



మనసు ఉంటే మంచి మార్గముంటుంది.

కనలుతుంటే మనలో దుఃఖమే మిగులుతుంది.

కలిసి మెలిసి ఉంటే అనురాగ సౌధము.

అడుగు ముందుకేస్తే అందుతుంది అనుబంధాల స్వర్గము.//




రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics