బాలకార్మికులు.
బాలకార్మికులు.
-----------------------
తేటగీతి మాలిక//
పాలబుగ్గల పాపాయి కూలి పనుల
కాయ కష్టము చేయుచు కమిలి పోయె
పసిడి నవ్వులు చిల్కుచు బాల యిపుడు
తట్ట నిండుగా మట్టిని తాను మోసె.
కాసు కొఱకీ వయసున తాన్ గష్ట పడుచు
జీవనంబును గడుపగ చింత మిగులు.
బాల కార్మికులకు నేడు బ్రతుకు భయము
చదువు సంధ్యలు లేవిట సాయ మెవరు?
చుట్టు చూడ గంజిని పోయు చుట్ట మెవడు?
దుర్భరమ్ముగ బ్రతుకున దొరలుచుండి
కుములు చుందురు వీరిట కూలి పోయి.
జాలి చూపెడి వారేరి జగతిలోన
పాలకులకు వీరి యవస్థ పట్ట దాయె.
తీరుబడిలేని మనుజుల తీరు చూడ
నేహ్య భావమ్ములే కల్గు
నెవరికైన.
జాతి రత్నాలు వీరిపై జాలి చూపి
కదిలి రండమ్మ!వేగమే కరుణ తోడ
బడికి పంపించి వీరల బ్రతుకు నిలిపి
చదువు సంధ్యలు చెప్పించి సాక వలయు.
నేత లందరు మేల్కొని నెఱవు చూపి
బాల కార్మికులకొఱకు మేలు చేయు
పనులు చేసిన చాలును భవిత మిగులు
భవ్యమై వెల్గు భువియందు భారతంబు./
