అతివ మనసు
అతివ మనసు
ఎంతటి సుమ కోమలమో..మీటలేరె అతివమనసు..!
అద్దానికి ప్రతిరూపమె..చూడలేరె అతివమనసు..!
అమాయకత సొంతమైన..గాజుబొమ్మ గమనిస్తే..
అపురూపపు చిత్రపటమె..గీయలేరె అతివమనసు..!
పెనుతుఫాను కడలిఘోష..దాచుకున్న హృదయమదే..
మౌనగగన సోయగమే..పట్టలేరె అతివమనసు..!
కర్పూరపు కొండ తనే..కరిగిపోవు చెలిమిమీర..
వెన్నెలింటి పంటకదా..దోచలేరె అతివమనసు..!
కష్టానికి వెనుకాడక..కాడి మెడను వేసుకొనునె..
అసలుప్రేమ చిరునామా..తెలియలేరె అతివమనసు..

