STORYMIRROR

Jyothi Muvvala

Classics Inspirational Others

4  

Jyothi Muvvala

Classics Inspirational Others

అమ్మనయితే గాని తెలియలేదే అమ్మ!

అమ్మనయితే గాని తెలియలేదే అమ్మ!

1 min
254


బిడ్డ జర భద్రం అంటూ

దోస్తులతో పోవద్దంటూ

ఇంటికి వేళకు రాలేదంటూ

కసిరినప్పుడు తెలియలేదే అమ్మ!

అ- అనురాగాన్ని

మ్మ-మమకార మాధుర్యాన్ని

రెండు పదాలలోని అంతర్థాన్నికి

అర్థమే నీవని... అమ్మని!

కంటిపాపలా కచావని

నీడలా నా వెంట సాగవని

మృగాల వేటకు బలికాకుండా

అడుగడుగునా కాపాడుతూ నన్ను పెంచావు అని!

అమ్మనయితే గాని తెలియలేదే అమ్మ!

బిడ్డ సంరక్షణకై తల్లి పడే తపన

బిడ్డ కోసం తల్లడిల్లి పోయె

అమ్మ మనసులోని ఆవేదన!

పురిటినొప్పుల కన్నా

పెంచడమే కష్టమని తెలుసుకున్నాను అమ్మ !


-జ్యోతి మువ్వల 




Rate this content
Log in

Similar telugu poem from Classics