అలుపెరుగని ప్రేమ
అలుపెరుగని ప్రేమ
ప౹౹
అలపే ఎరుగని అచ్చమైన నిజ ప్రేమికుడా
గెలుపే తరగని గమ్యమే గల స్వాప్నికుడా ౹2౹
ప౹౹
అందమంటే అతివది అని చాటించగలవా
సుందరమైన మనసుతో నిరూపించగలవా ౹2౹
పంచిన ప్రేమా పరువంలో పది రెట్లగునులే
ఉంచిన నెమ్మి ఊరించి రేపటి మెట్టగునులే ౹ప౹
చ౹౹
కోరికలా కొండంత మదిని చేరి పెరుగునులే
మరకలా మనుసులో తారాడి తిరుగునులే ౹2౹
తీర్చ ఆ వాంచనే తీరిక చేసి నీ ప్రేమ పంచు
కూర్చి కూరిమినే చేరికతో ఆమెదుటే ఉంచు ౹ప౹
చ౹౹
వ్యర్ధ ప్రేమికుల స్పర్ధ మాటలను మరి వినక
స్వార్ధంలేని స్వచ్చత చూపూ ఎలమి వెనుక ౹2౹
జయం నీదే కలసి జరిపించ వలపు యజ్ఞం
హయమనే ప్రేమను స్వారించుటే మనోజ్ఞం ౹ప౹