అక్షరాలు
అక్షరాలు
అక్షరాలు...
అక్షరాలు పలక బలపంతో దిద్దడం మొదలు
నా ప్రతి "అ "అను అక్షరం... అమ్మ నాన్న గురువు...
అన్ని నాకు నామనసుకు మౌనముగా బోధిస్తూనే
నీవు ఇంకొకరికి నీ చేతనైనా సహాయం చెయ్యి
నీకు వీలు అనుసారము అంతే కానీ చిన్న చూపు కాదు.
నువ్వు చూపే ఆదరణ ఇంకొకరికి మేలు చేసేలా వుండాలి.
తప్ప మనసును గాయపడనివ్వకు అంటూ....
రోజు అక్షరాలు నేర్పిన జ్ఞానం విజ్ఞానం
నన్ను పరిజ్ఞానమనే దిశలో నిల్చోబెడుతునే ఉన్నాయి
అక్షరాలు.. అక్షింతలే వేస్తూ...