అహంకారం
అహంకారం
(బాలపంచపదులు )
బుద్ధిలో విషబీజం నాటుతుంది
మదిలోన తెరలు కడుతుంది
చూపు మసకబారిపోతుంది
తుదకు తన వాళ్లనే కాదంటుంది
అహంకారమొక దుర్గుణం విజయ.
మనిషిని ఒంటరిని చేస్తుంది
బంధుమిత్రులను కాదంటుంది
బంధాలేవీ తనకు లేవంటుంది
గర్వాన్ని తలకెక్కించుకుంటుంది
అహంకారమొక దుర్గుణం విజయ.
వినాశనానికి హేతువవుతుంది
విమల గుణమును పోగొడుతుంది
మసటును మదిలో నింపుతుంది
మంచితనమే తనకు లేదంటుంది
అహంకారమొక దుర్గుణం విజయ.
