అహి.. నిలయి
అహి.. నిలయి
ॐॐॐ
श्री गुरूभ्योनमः
श्रीमात्रेनमः 🙏
అహి... వృత్తము
భభ భభ భభ మ /13
విశ్వము నందున దీనులు నీదరి వేచిరి భార్గవి మాతా! నీ
శాశ్వత మైన సమున్నత స్వస్తిని సంతుకు బంచుమ కౌమారీ!
నశ్వర మౌజన జీవన మిథ్యను నాశము జేయవె చిద్రూపీ!
ఈశ్వరు నాజ్ఞకు బద్దుల మౌదుము నీదయతో దేవీ!!
✍️చావలి బాలకృష్ణవేణి
14::03::'23
