అడవి తల్లులు
అడవి తల్లులు
పాముల పుట్ట పై కేరింత
పగిడిద్దరాజు తో పెళ్ళాంట
శివంగి రూపం నృసింహా వంశం
గిరిజన జనుల రాణీవే సమ్మక
అక్కడి జనానికి అమ్మక్క గా
పచ్చని వనంలో తులసి మొక్కగా
పసర్ల తో జబ్బులు నయం చేస్తూ
అడవికే వెన్నెలైతివే మా అక్క
సారలమ్మ,నాగులమ్మ,జంపన్న
సంతానం పొంది
పొలవాస పట్టాపు రాణిగా మేడారం లో
ఆడంబరంగాగిరిజనులను
పాలించితివే మా అమ్మ
ప్రతాపరుద్రుని ప్రతాపం ఎంతని
పన్నులు కట్టం యుద్ధానికి సిద్ధమని
గెరిల్లా యుద్ధం పోరాటమే తధ్యమని
పోరులో అమరత్వం పొందిన వన దేవతవి
జాతరమ్మ జాతర ..
మేడారం జాతర
వన దేవతల జాతర,
సామ్మక-సారలమ్మ జాతర
తెలంగాణ జాతర
జనం మెచ్చిన జాతర
భక్తితో కొలిచే పదిరోజులు జాతర
**************వెల్మజాల నర్సింహ.
చరవాణి.9867839147
గ్రామం.దుప్పల్లి.యాదాద్రి జిల్లా.
