STORYMIRROR

Midhun babu

Classics Thriller Others

4  

Midhun babu

Classics Thriller Others

ఆత్మ విమర్శలు

ఆత్మ విమర్శలు

1 min
3


తప్పు ఒప్పులు, మంచిచెడులు

కష్టాలు సుఖాలు,దుఖఃము, సంతోషాలు

వెరసి నడిచి పయనించేది మానవజీవితం

జీవితం ఓ ప్రయాణం అయితే

అందులో మనం చేసే ప్రతి

పనికి ఓ మైలేజీ ఉంటుంది

దాన్ని బట్టి ఫలితం ఉంటుంది

ఈ సుదూర ప్రయాణం లో ఎన్నెన్నో

ఎగుడుదిగుడులు మలుపులు మెలికలు ఎదురుపడుతుంటాయ్

 ఒక్కోసారి వెనక్కు తిరిగి 

చూసుకునే అవకాశం జీవితం ఇవ్వచ్చు

ఇవ్వకుండానే ముగిసి పోవచ్చు

అయితే ప్రతి మానవ జీవితంలో

మనసు మూలల్లో,పొరల్లో

నక్కిపోయి బయటకు రాని చీకటి కోణా లెన్నో

 నిశి నిండిన రాతిరిలోమంచం పై పడుకొని

చుక్కలు నిండిన ఆకాశాన్ని చూస్తూ

 మెల్ల మెల్లగా గతపు జ్ఞాపకాల పొరలను

నీ అంతరాత్మ తాకి తవ్వుతున్నప్పుడు

నిలదీసి నిన్ను స్కాన్ చేసిన ఆత్మ విమర్శ ప్రశ్నల

బాణాల పరంపరకు నిలబడి నువ్వు సమాధానం

చెప్పగలిగితే నీ కంటే ప్రశాంత మానస సరోవరం 

ఈ భూ మండలం పై మరెక్కడా ఉండదు ఉండబోదు

మానవ జీవిత సంఘర్షణా ప్రయాణంలో

విమర్శ, ఆత్మ విమర్శ దిక్చూచి వంటివి

పెడచెవిన పెట్టనంత కాలం



Rate this content
Log in

Similar telugu poem from Classics