STORYMIRROR

Pokala Radhika

Classics Inspirational Others

4  

Pokala Radhika

Classics Inspirational Others

ఆమె ప్రేమ ఆకాశం

ఆమె ప్రేమ ఆకాశం

1 min
244

అవనిలో దేవత మూర్తి ఆమె

ప్రతి ఇంటి లోగిలిల్లో ఆమె

ఏ కష్టం వచ్చిన వెలుగులు విరజిమ్మే ఆమె 

నిస్వార్థంమే తెలియని ఆమె

తియ్యని మధురిమ పిలుపులో ఆమె

జీవితమున అలసిపోకుండా కర్తవ్యం దిశలో ఆమె

జగమెరిగిన ధర్మబద్ద మణిరత్నమే ఆమె

పుట్టిన బిడ్డ భద్రతకు ప్రతి క్షణం తపించేది ఆమె

ఆమె లేక పోతే లోకమనేది లేదు అతడికి

ఆమె ప్రేమ ఆకాశం

ఆమె కథ కథనం కడలిలాంటి లోతు

ఆమెకు సాటి ఎవ్వరూ... ఈ లోకాన

తీర్చలేరు ఆమె ఋణాన్ని...

తీర్చుకోవాలి.. వృద్యపు నీడల్లో నైనా 

తోడు నీడనివ్వాలి..

ఇదే ఆమెకు ఇచ్చే మన కానుక.

ఆమెకు జోహార్లు అర్పిస్తూ..నేను.



Rate this content
Log in

Similar telugu poem from Classics