తిరిగిరాని ఉత్తరాలు
తిరిగిరాని ఉత్తరాలు


కొన్ని బాధపడే సందర్బాలు
ఉత్తరము రాస్తూ పడే అవేదన కనిపించనివ్వక
ఉత్తరాన్ని ముగించేస్తాము
కొన్ని సంతోషపడే అలంబనలు
ఉత్తరం రాగానే చదివి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొంటూ జ్ఞాపకాలలో దాచుకుoటాము
విసిగి వేసారి
వినలేని మోయలేని భారంగా
మనసు కటినముగా
మారితే ఆ మనసుకు ..
ఇక తిరిగి రాని (వచ్చిన )ఉత్తరంకు
విలువ?!
ఒక అక్షర పదం విలువ
ఇచ్చే సందేశం ఎదుటి మనసుకు తృప్తిని ఇస్తుంది
ఒక్క మాట విలువ ఎదుటి వారిలో
వారి విశాలమైన గుండెల్లో దైవం ను తలపిస్తుంది
క్షణ క్షణం మారుతున్న కాలానికి అనుగుణంగా
మారే మమతల్లో నిస్వార్థ ప్రేమ విన్నపాలుగా
చూసే వారు తలిచే హృదులుగా
వున్నంత కాలం
తిరిగిరాని ఉత్తరాల కన్న
తిరిగి వచ్చిన ఉత్తరాల ప్రత్యుత్తరం
నిగూడముగా నిలువెత్తు నిదర్శనంగా
మదిలో నింపుకున్న ముద్రలుగా
దాచుకోనే వారే (వారి)
ప్రేమ త్యాగ ఫలం.