శీర్షిక:గురుభ్యోనమః
శీర్షిక:గురుభ్యోనమః
అర్జునుడిని అందలం ఎక్కించిన ద్రోణుడు
ఏకలవ్యుని అతఃపాతాళానికి తొక్క లేదా !
అమ్మలా లాలించాల్సిన గురువులు
అసురులై హతమార్చలేదా!
స్వచ్ఛందంగా విద్యా ధానం చేసే పుణ్యమూర్తులు చేతి వేళ్ళలో ఉంటే
స్వలాభపేక్షణతో విద్యను అమ్ముకుంటూ
ఎదురు తిరిగితే విద్యను దూరం చేసేవారు లక్షలో లేరా !
వృత్తిని దైవంగా భావించి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేసిన వారు కొందరైతే
సమానత్వము చూపలేని కఠిన హృదయలు మరికొందరు కాదా?
అన్ని దానములలోను అన్నదానం మేలైయితే
విద్యా దానం అన్నిటికన్నా గొప్పదే కదా!
మనుషులందు పుణ్యపురుషులు వేరున్నట్టే
గురువులందు ద్రోహులు కలరయ్యా!
అధికారం చూపి విద్యను దూరం చేసే గురువులు వీరేనయ్య!
మనసున్న మహానుభావులు మంచి గురువులకు సదా ప్రణమిల్లుతూ
అక్షరాస్యత పెంచి అక్షయముగా దేశ అభివృద్ధికి పాటుపడే పట్టుకొమ్మలే గురువులు అని గుర్తుచేస్తూ
దేశ భవితకు మార్గదర్శం చూపమని అర్థిస్తున్నామయ్యా
తల్లి , తండ్రిని మించిన దైవం గురువనే నినాదాన్ని బ్రతికించమని వేడుకుంటున్నామయ్యా !!
జ్యోతి మువ్వల
5/09/22
