VENKATALAKSHMI N

Abstract Inspirational Others

4  

VENKATALAKSHMI N

Abstract Inspirational Others

వలస పక్షుల వేదన

వలస పక్షుల వేదన

4 mins
375



మాం...మై డియర్ మాం...వేర్ ఆర్ యూ ..?కేకలతో 12ఏళ్ళ కొడుకు భరత్ కిచెన్ లో వేతికాడు అమ్మ కోసం భరత్ 

   రేయ్ నాన్నా!నేనిక్కడున్నారా..సమాధానం బయటి నుండి అమ్మ.

   ఓహ్ ...మాం..ఆర్ యూ హియర్ ?వాట్ ఆర్ యు డూయింగ్ మాం?

   ఒరేయ్ !ముందు మాం అనడం మానేస్తావా లేదా?కంపరంగా వుంటుంది నాకలా పిలిస్తే.ఎన్ని సార్లు చెప్పినా మానవా ఆ పదంను?కటువుగా పలికింది అమ్మ.

   డియర్ డార్లింగ్ !ఇది అమెరికా.పేడ పిసుక్కునే పల్లెటూరు కాదు మాం.ఇలా మాట్లాడితేనే గ్రేట్ ఇక్కడ.తెలుసా!ఊరికే ఆర్గ్యూ చేయకు మాం?ఐ వాంట్ బూస్ట్ .గివ్ మీ యార్ ..మెడ చుట్టూ చేతులేసి గోముగా పలికాడు.

     నిన్నని లాభం లేదురా?ఇదంతా మీ నాన్న పుణ్యమే.వద్దు వద్దు అన్నా వినక ఫారిన్ లో జాబ్ చేయాలంటూ తీసుకొచ్చారు.ఇక్కడి పద్ధతులతో ,అలవాట్లతో చిరాకొచ్చేస్తుంది.ఆ పేడ పిసుక్కునే పల్లెటూరే నిన్నిక్కడి దాకా రానిచ్చింది.అది మర్చిపోకురా వెధవా!మొట్టాకాయేసింది కాస్త కోపంతో కూడిన ప్రేమతో.

   అబ్బా!మొదలెట్టావా నీ నస.మీ ఊరి గ్రేట్ నెస్ నువ్వే చెప్పుకోవాలి మాం.ప్లీజ్ !ఐ వాంట్ బూస్ట్ మాం.వెరీ హంగ్రీ డియర్ !

   చంపేస్తారా అలా పిచ్చి పిచ్చి పేర్లతో నన్ను పిలిచావంటే?మీ అమెరికా సార్లు ఇలాగే పిలవమని చెప్పారా?కన్నతల్లిని డాళాంగ్ ,డియర్ అంటూ ఆ ఇంగ్లీషూ దొరసాన్లను పిలిచినట్టు పిలవడమేందిరా!నీ బొంద.జలదరిస్తుంది నాకు అంటుండగానే..

  "గుడ్ మాణింగ్ నాన్న,పొద్దున్నే మీ మాంతో గొడవేంట్రా నీకు" భార్య చేతిలో నీళ్ళ బకెట్ అందుకుని మొక్కలకు నీరు పోస్తూ అన్నాడు నాన్న మోహన్ .

   వచ్చారా..?మీ ముద్దుల కొడుకు ఇంగ్లీష్ నస నే భరించలేను బాబూ!ఇంకెన్నాళ్ళు ఇక్కడ?వీడి భాష చూస్తుంటే మన తెలుగును పూర్తిగా మరచిపోయేలా వున్నాడండి.మీ ప్రాజక్ట్ వర్క్ ఇంకెన్ని రోజులు?వీలైనంత త్వరగా ఈ అమెరికాను వీడక పోతే నన్ను కూడా ఇంగ్లీష్ దొరసానిలా మార్చే ప్రమాదముందండోయ్ ?

    హ్హహ్హహ్హ...మారిపోకూడదా డియర్ !నాక్కూడా చూడాలనుంది భుజమ్మీద చేయి వేస్తూ చిలిపిగా చెప్పాడు మోహన్ .

   ఇదుగో ఇదే..ఇదే నే వద్దంది. ముందు చేయ్ తీయండి.ఎదురుగా కొడుకున్నాడన్న స్పృహ ఏ మాత్రమయినా వుందా మీకూ?పైగా డియర్ అనడం కొరకొర చూస్తూ కిచెన్ లోకి వెళ్ళిపోయింది పద్మ.

     తండ్రీ కొడుకులు బాల్కనీలో కూర్చున్నారు తలొక ల్యాప్ ట్యాప్ లతో.

   దూరిపోయారా అందులోకి అప్పుడే?ఈ రోజు ఆదివారమన్న సంగతే మర్చిపోయి ఆ మిషన్ లతోనే కాలక్షేపం చేయండింక కప్పులందిస్తూ పళ్ళు నూరింది పద్మ.

   అబ్బబ్బ!ఏంటే నీ గోల?ఇది లేక పోతే ఏ పనీ జరగదు.ప్రాజక్ట వర్క్ మొత్తం ఇందులోనే చేయాలి .తప్పదు మరి .

  హా మాం!నా హోంవర్క్ కూడా ఇందులోనే చేయాలి కదా!

  ఏంటో బాబూ,మీరు మీ మిషన్ల గొడవ ?బొత్తిగా అర్థం కాదు.లక్షణంగా పెన్ను పుస్తకం పట్టుకుని రాసుకోవడం ఎప్పుడూ చూడలేదు.అలా అందంగా రాసుకుంటుంటే ఆ చేతివ్రాత చూడముచ్చటగా వుండేది.ఆ చేతివ్రాతను చూస్తూనే మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేసేవారు మా నాన్న.అచ్చం అన్నట్టే వుండేది మనిషి వ్యక్తిత్వం కూడా.అంత నైపుణ్యం

మా నాన్నారిది చెప్పుకొచ్చింది.


   వాట్ మాం?బుల్ షిట్ !ఏదో ఆనిమేషన్ కథలా వుంది నువ్ చెప్పేది వేటకారంగా నవ్వసాగాడు భరత్ .

   ఒళ్ళు మండుతుంది నాకు.అలా నవ్వకురా.కొట్టేస్తానేమనుకున్నావో!

   కూల్ కూల్ పద్మ!వాడికి నే చెప్తానుండు సౌమ్యంగా సమాధానమిచ్చాడు భార్యకు.

   భరత్ !మీ మాం చెప్పింది అక్షరాలా సత్యం.మీ తాతయ్య అమ్మమ్మ లు మనిషిని అంచనా వేసే సామర్థ్యం కలవారు.వారికి వారి జీవన అనుభవాలే పాఠాలుగా నేర్పుతాయి.వారి సమక్షంలో పెరిగింది మీ మాం.కనుకనే పద్ధతిగా ,సంప్రదాయంగా మెలుగుతుంది.వారి జీవన విధానమే మీ అమ్మకు ఆదర్శం.ఉమ్మడి కుటుంబంలో పెరగడం వల్ల ఈ కొత్త పరిసరాల్లో కూడా సర్దుకుపోగల తత్త్వం అలవడింది.మంచి చెడుల విచక్షణలు నేర్వగలిగింది.మర్యాద పూర్వకమైన మాటలతో పదుగురి మెప్పు పొందగల చాతుర్యం అబ్బింది అంటుండగానే భరత్ అంధుకుని..

  మరి అమ్మమ్మ తాతయ్యలను కూడా ఇక్కడికే రమ్మనండి డాడ్ .అమ్మకు తోడు వుంటారు.అప్పుడు మనక్కూడా ఈ ఆర్గ్యూ చేసే బాధ కూడా తగ్గుతుంది కదా అంటూ నాలుక్కరిచాడు.

  ఏరా!బడుద్దాయ్ !ఎలా కనబడుతున్నారా నీకు ఓ దెబ్బ వేసింది చిలిపిగా.

   నో మాం!జస్ట్ ఫర్ జోక్ .డోంట్ బీ సీరియస్ మాం.లవ్ యూ సో మచ్ మాం అంటూ వాటేసుకున్నాడు.

  ఇదుగో !మళ్ళీ అవే మాటలే! ఏం కల్చరో ఏమో?కాకులెత్తుకుపోనూ!తనలో తనే తిట్టుకోసాగింది పద్మ.

   సరే !టుడే ఈజ్ సండే. జాలీడే!సో వుయ్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ .ఒకేనా డియర్ .

   మీతో మొరపెట్టుకోవడం కంటే బండరాయితో చెప్పుకున్నా ఈ పాటికి కరిగిపోయేదేమో!)సరే పదండి వెళదాం తయారవండి మరీ.

   ఓహ్ !థాంక్యూ డాడ్ .థాంక్యూ మాం!

 ముగ్గురూ సరదాగా బయటకెళ్ళి పోయారు.ఆనందంగా గడిపి తిరిగింటికి వచ్చి అలసి పోయి పడుకున్నారు.

  మరుసటి రోజు ఉదయం పద్మ లేచి భరత్ ను స్కూల్ కి పంపించిన తరువాత భర్తతో మాట కలుపుతు"ఏవండీ!ఏమన్నా పనుందా మీకు?కాసేపు మాట్లాడొచ్చుగా!"లాప్ ట్యాప్ లో మునిగిన భర్త పక్కన కూర్చుంది.

   సరే !నీకంటే ఈ పనేం ముఖ్యం కాదులే డియర్ నాకు.ఏం చెప్పాలని ఇంత పొద్దున్నే నేను గుర్తొచ్చాను డాళింగ్ కు ఆట పట్టించసాగాడు మోహన్.

  అబ్బా!దొరికితే చాలు ఏడిపించాలని రెడీగా వుంటారు తండ్రీ కొడుకులు.ముందు నే చెప్పేది వినండి.మనబ్బాయిని మా ఊరికి పంపించేద్దాం.ఇక్కడుంటే ఈ అమెరికా పూర్తిగా మార్చేస్తుంది వాణ్ణి.

   ఆ భయమెందుకు పట్టుకుంది పద్మా నీకు?మారడమనేది మనిషి అలవాట్లను బట్టి వుంటుంది.పెరిగే వాతావరణం,తల్లిదండ్రుల ప్రభావం ఇలా చాలా వుంటాయి.మనబ్బాయిని మనం సరైన పద్ధతుల్లోనే నడిపిస్తాంగా!

   అయ్యో!మనం నడిపించడం సరేనండి.వాడి స్కూల్ వాతావరణం ,ఇక్కడి ఫ్రెండ్స్ ,అమెరికా కల్చర్ ఇవన్నీ చూస్తుంటే మంచి వాడు కూడా మారిపోయే అవకాశముంది.ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరై పోతారంటారుగా.అదే నా భయం.మీరూ డాళింగ్ అనడమే, వాడూ డాళింగ్ అనడమే.అమ్మా అని పిలవడమే మరచి పోయాడు వాడైతే.ఎంచక్కా మన భారతీయ సాంప్రదాయాలు,పల్లె సంస్కృతులు,పచ్చని వాతావరణం మధ్యలో పెరిగితే మనలాగే మన బాబు కూడా మంచి ప్రయోజకుడవుతాడు.వున్న ఒక్కగానొక్క కొడుకు ఈ విదేశీ అలవాట్లతో భవిష్యత్తులో మనకు దూరమైపోతాడేమో?విలువలు తగ్గుతున్న నేటి తరుణంలో ఇలాంటి చోట వుంచితే అదేదో సామెత చెప్పినట్టు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమండి వాపోయింది పద్మ.

     ఇప్పుడేమయిందని..?వాడింకా చిన్న పిల్లాడేగా!

    అందుకే మొక్కలోనే తుంచకపోతే మ్రానైందంటే వంచలేమంటున్నానండి.

  ఏమిటో డియర్ !నాకేమీ అర్థం కావటం లేదు నీ మాటలు.వివరంగా చెబితే కదా!

  నిన్న మనం బయటికెళ్ళాంగా!ఆ పార్కులో తెల్ల జంటలు మీ భాషలో లవ్వర్స్ ఒకరికొకరు మూతులు నాక్కుంటూ,భుజాలు రాసుకుంటూ పబ్లిక్కన్న సంగతే మరచిపోయి అసహ్యంగా ప్రవర్తిస్తుంటే మన బాబు వింతగా వారినే గమనించడం నేను చూశాను.వాడేంటీ మీరూ అలాగే చూడడం నా కంట పడింది.అక్కడ తప్పు మీదని నేనననండీ.విదేశీ సంస్కృతీ ఇలా తగలడింది. ఆడ మగ తేడా లేని డ్రస్సులూ,ఎవరికి ఎవరు ఏం వరసవుతారో కనిపెట్టలేని అయోమయం.ఈ కల్చర్ను వల్చరొచ్చి ఎత్తుకుపోనూ..?అంటూ తిట్టసాగింది పద్మ.

  వావ్ !పద్మా!నువ్వు కూడా ఇంగ్లీష్ ...వండర్ ..

 చాల్లేండి సంబరం..అదో బ్రహ్మ విద్య మరీ.లేచినప్పటి నుండి ఇంగ్లీష్ ఈగ చెవిలో మోగుతుంటే రాక ఛస్తుందా.అయినా మనసు పెట్టానంటే అదెంతసేపులెండి.మీ కన్నా బాగా మాట్లాడేయగలను,తెలుసా!

   అమ్మో!నీలో చాలా వుంది పద్మా!యు ఆర్ వెరీ ఇంటలిజెంట్ యా..అంటూ బుగ్గ గిల్లాడు.

   అబ్బా!వేళాపాళా లేని సరసమేంటండి మీకు?పైగా పిల్లాడున్నాడన్న ధ్యాస కూడా వుండదా?నిన్న బాబు ఎదురుగానే నన్ను తాకడం చేస్తుంటే ఒళ్ళు మండింది.ఈ ఇంగ్లీషు గాలి,అమెరికా నీళ్ళు బానే ఒంటబట్టాయండోయ్ !ఇదే ఇలా మారి నన్ను కూడా మారుస్తారనే మన ఊరికి పంపించేద్దాం బాబును.మా అమ్మ సమక్షంలో పెరిగితే పద్ధతిగా క్రమశిక్షణగా విలువలు తెలిసి మసలుకోవడం నేర్చుకుంటాడండి.

   నీవన్నది కూడా నిజమే పద్మ .నీలా ఆలోచించలేకపోయాను.విదేశీ మోజులో మన జన్మభూమిని నిర్లక్ష్యం చేస్తున్న సంగతే మరచిపోయాను.మన సాంప్రదాయాలను మనమే తుంగలో తొక్కేస్తుంటే ఈ విదేశీయులు మన భారతీయతను గొప్పగా చెప్పుకుంటున్నారు.కానీ మనం మన దేశాన్ని ,మన అలవాట్లను, పద్ధతులను చులకనగా చూస్తున్నాం.మన పిల్లలను మనమే చేతులారా పెడదారి పట్టిస్తున్నాం.ఆలస్యంగానైనా మంచి మాట సెలవిచ్చావు.ఇంకో ఆరు నెల్ల వరకు నా ప్రాజక్టు పనుంది.ముందు బాబును

పంపించేద్దాం.తరువాత మనమెళదాం.మంచి పనిని ఇప్పుడె చేసేద్దాం. వలస పక్షులమైన మనం సొంత గూటికి ఎగిరిపోదాం త్వరలోనే.సొంత ఊరిలో వున్న హాయి ఆనందం ఇంకెక్కడా దొరకదు.మన మూలాలు మరువరాదని గుర్తు చేశావు . కంటి చెమ్మను తుడుచుకుంటూ భార్యను హత్తుకున్నాడు.

   హమ్మయ్యా!మీ నోరు తీపి చేయాలి.మంచి మాట వినిపించినందుకు.మీరు డియర్ డాళింగ్ అంటుంటే మీరూ మారిపోయి నన్ను కూడా దొరసాన్ల మాదిరి గౌన్లేసుకోమంటారేమోనని భయపడ్డాను.ఇక్కడే వుండిపోతే మాత్రం అదే జరిగేది.అనుమానమే లేదు బాబోయ్ అనేసరికి మోహన్ పకపకా నవ్వాడు.

సంతోషంతో ఆనందభాష్పాలు వచ్చాయి పద్మకు.

కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పింది.

  ఇలా ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తే ప్రతీ ఇల్లు ఉమ్మడి కుటుంబమైపోదా!ప్రతీ ఇల్లు పిల్లాపాపలతో సంతోషాల మయమే కదా!ప్రతీ ఊరు పచ్చని అనుబంధాలమయమే అవదా!ప్రతీ భారతీయుని గుండె ఉప్పొంగి పోదా!

   

  


Rate this content
Log in

Similar telugu story from Abstract