VENKATALAKSHMI N

Abstract Inspirational Others

4  

VENKATALAKSHMI N

Abstract Inspirational Others

నిత్య సూరీడు

నిత్య సూరీడు

2 mins
666


నిత్య సూరీడు

హమ్మయ్య!ఆదివారం వచ్చేసింది. వీకెండ్ కోసమని ఎంత గా ఎదురుచూస్తానో!ఉదయభానుడు వచ్చి నిదుర లేపితే తప్ప లేవను ఆదివారం. లేచాక ఓ చేతిలో టీ కప్, మరో చేతిలో వార్త పత్రిక పట్టుకుని దినచర్య ను మొదలుపెడితే ఉంటుందీ, ఆ మజాయే వేరులే. అలా పేపర్ తిరగస్తూ ఉంటే నాగలికి ఉరిసుకున్న రైతు బొమ్మ నా కంట బడింది. ఎందుకో ఆ దృశ్యం నా కంటిని దాటి వెళ్లకుంది. మనసు వెంటనే పరుగు తీసింది తాతయ్య ఉన్న పల్లె కు.

  సెలవులకు ఊరేళ్ళినప్పుడు మా పిల్ల గ్యాంగ్ ను వెంటేసుకుని పెద్దల తో పొలానికి బండి కట్టేవాడు తాతయ్య.అక్కడ మాతో కలుపు తీయించేవాడు.పిల్ల కాలువలో దించి చేపలు పట్టించేవాడు. వరి నాట్లు చూడమని బురదలో అడుగు పెట్టమనేవాడు. పూలు కోయించేవాడు. వేరుశనగల ను కాలువలో నీళ్లతో కడగామనేవాడు.వాటిని అమ్మమ్మ, అమ్మ వాళ్ళు పుల్లలతో నిప్పు పెట్టి అందులో వేసి కాల్చేవారు. చల్లారక తాతయ్య చుట్టూ చేరి

చింత చెట్టు నీడలో కథలు వింటూ ఆరగిస్తూ ఉంటే సమయమే తెలిసేది కాదు. అన్ని ఒక్కసారిగా మనసును కుదిపేసాయి.పుస్తకం లో దాచిన నెమలీకల్లా జ్ఞాపకాలు కంటిని తడిపేసాయి. అంతే ఉండబట్టలేక లేచి మొబైల్ ను తీసి నా ఫ్రెండ్స్ 5 మందికి కాల్ చేసి వెంటనే రెడీ కమ్మని ఆర్డర్ వేసాను. ఎందుకని అడిగే అవకాశం కూడా వాళ్లకు ఇవ్వలేదింక నేను. కాలేజీ లో నా మాటంటే అందరు ఓకే అన్నాల్సిందే. దట్ ఈస్ సాధన, అంటే నేనేనoడోయ్.

  సరిగ్గా 10 కoతా అనుకున్న చోటికి చేరాము. ఆతృతగా అందరు ఎందుకు ఏమిటి ఎక్కడికి అంటూ యాక్ష ప్రశ్నలు సంధించారు ముకుమ్మడిగా.సరేనంటూ ముందు ఈ బండేక్కండి అనేసరికి షాక్ అయ్యారు. ఈ ఎడ్ల బండి మీదనా అంటూ నొల్లెల్లబెట్టారు. హా హా ఈ బండేనమ్మ అమ్మలక్కలు అన్నా. గుడ్లురిమారు నా మీద. పట్టు పావడాలతో పల్లెటూరి పిల్లలా రెడీ అయి రమ్మంది అందుకేనామ్మ లీడరమ్మ అని ఎద్దేవా చేసారంతా. నా మీద నమ్మకముంచి వస్తే, మీరు మంచి అనుభవం చవి చూస్తారు. ఆనక మిస్ అయ్యమే అని ఫీలయితే మాత్రం నేను బాధ్యురాలిని కానమ్మ అని ఊరించాను వాళ్ళను. నిజమా, అయితే పదా త్వరగా అంటూ ఎడ్ల బండి మీద పోటీ పడి ఎక్కేసారు.

  ఎడ్ల బండి నడిపిన అనుభవం తాతయ్య చలవే అని వీరికి తెలీక సాంబ్రామాశ్చర్యాలకు లోనవుతున్నారు పిచ్చి మాలోకాలు. దారిలో కనిపించిన పొలం లో దిగామన్నాను. ఇక్కడా, ఛీ మేము రాము బాబోయ్ అంటూ ఈసదించుకున్నారు.ఎయ్ అన్నా నాలుక మడత పెట్టి. పరుగుపరుగున పావడాలను రెండు చేతులతో ఎత్తి పట్టుకుని చెంగు చెంగున లేడి లా ఎగురుతు బురదలో కాలు మోపారు ఛీ ఛా అంటూనే.

 పెద్దయ్య మీకు మేము సాయం చెయ్యమా అని మాట కలిపాను ఆ పొలం పెద్దాయనతో. ఎవరమ్మా మీరంతా అని తేరిపారా చూసాడు రైతు. అదేం లేదు పెద్దయ్య ఇటుగా వెళ్తూ ఉంటే మీ పొలం లోని వరి పైరు మమ్మల్ని స్వాగతం అంటూ పిలిచాయి. మా వైపు వాలిపోతు వగలు పోయాయి. వాటి తడాఖ చూద్దామని వచ్చాము.పకపక నవ్వాడు పెద్దాయన. ఆ పైరంత స్వచ్ఛమైన నవ్వును కెమెరాలో బందించాం.

 ముచ్చటగా ఉన్నారంటు మురిపెంగ మాటలు చెప్పాడు. వరి పంట నాట్ల దగ్గరి నుండి వడ్లు మిషనకు వేసి బియ్యం ఇంటికి చేర్చే వరకు సాధకాబాధకాలు వివరించాడు. అది విన్న మా ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. వెంటనే ఎవరికీ వారే పంట మీద ప్రమాణం చేస్తూ "ఇక మీదట ప్రతి సెలవు రోజున పొలం లో రైతు కు చేతనైన సాయం చేసి, కొంతైనా ఋణం తీర్చుకుంటాం"నొక్కి వక్కాణిoచారు. ఆ మాట విన్న పెద్దాయన మీలాగే అందరు ఆలోచిస్తే రైతే రాజన్న నానుడి నిజం అవుతుంది అంటూ తన దినచర్యలోకి ఒదిగిపోయాడు నిత్య సూరీడులా.

  సాధనా, ఇంత మంచి మెమరీ ని ఇచ్చిన నీకు థాంక్స్ తక్కువే అంటూ కావలించుకున్నారు. వారి సంతోషాన్ని ఇంత కంటే ఇంకెలా చెప్తారెవరైనా.రైతుల గురించి చెప్తే వింటారా మరి, అందుకే అనుభవ పూర్వకంగా సాధించాను. అందుకే నేను సాధన అయ్యాను.


Rate this content
Log in

Similar telugu story from Abstract