వాన జల్లు
వాన జల్లు


శ్రావణ మాసం. వాన జల్లు మొదలైంది. లక్ష్మి తిట్టుకుంటూ నిద్ర లేచింది.
మాయదారి వాన. ఈ వాన ఇవ్వాళే కురవాలా. ఇంత వాన కురిస్తే ఇళ్లలోంచి జనాలు బయటికి రారు.
తను నాలుగు రూపాయలు చూడాలంటే గుడికొచ్చే జనం తన బండి దగ్గర కొబ్బరికాయలు కొనాలి.
లక్ష్మి భర్త ఆమెతో గొడవపడి వేరుగా ఉంటున్నాడు.
కూతురు గీతకి ఇంకా ఏడేళ్లు నిండలేదు.
గీత ఇంటి పైకప్పు లోంచి పడుతూ ఉన్న వాన జల్లు చూస్తూ ఉంది.
వాన జల్లు ఆ పాపకు సంతోషం ఇస్తోంది.
లక్ష్మికి మాత్రం ఆ రోజు వాళ్ళ భోజనాన్ని ఎవరో లాక్కెళ్లి పోతున్నట్టు అనిపించింది.