ఊరగాయ సీసా
ఊరగాయ సీసా
27-03-2020
ప్రియమైన డైరీ,
లాక్ డౌన్ లో మూడో రోజు.రోజూ ఉట్టి రసంతో తినాల్సి వస్తోంది.మరి మాకు దొరికేది అదే కదా.
ఇవాళ ఎలాగైనా సరే ఊరగాయ కొనాలని నిర్ణయించుకున్నాను.
పొద్దున్నే లేచాను.ఉదయం ఆరింటికల్లా సూపర్ మార్కెట్ క్యూలో నిలుచున్నాను.
ఎనిమిదింటికి నా చేతిలో ఊరగాయ సీసా ఉంది.
బిల్ కట్టి రూంకి వచ్చాను.
ఊరగాయ సీసా మూత తీసి దాని పరిమళాన్ని
ఆస్వాదించి మళ్ళీ మళ్ళీ దానిని చూస్తూ గడిపాను.