ఉండిపోరాదే..
ఉండిపోరాదే..
రిత్విక్!
ఇది మరీ ఓవర్ యాక్షన్ కాదా.సునయన తన స్మార్ట్ ఫోన్ చూస్తూ మాట్లాడుతోంది.
రిత్విక్ ఏంటబ్బా అంటూ సునయన భుజాల మీద చేతులు వేసి దగ్గరకు తీసుకుంటూ అడిగాడు.
నిజం చెప్పు ఇందులో నువ్వు వ్రాసిన కథ మన లివిన్ రిలేషన్షిప్ గురించే కదా.సునయన ఫోన్లో ఒక స్టోరీ యాప్ చూపిస్తూ అడిగింది.
రిత్విక్ కాసేపు మౌనంగా ఉన్నాడు.నీకు నచ్చలేదా అని ఆగాడ
ు.సునయన అతని ఒళ్ళో తల పెట్టుకొని అతడినే చూస్తోంది.
ఆమె అతడి మెడ చుట్టూ చేతులు వేసి అతడి ముఖాన్ని దగ్గరగా తీసుకుంది.
అతడి పెదాలు అప్రయత్నంగా ఆమె పెదాల్ని పలకరించాయి.
మన పెళ్ళి గురించి కూడా వ్రాయొచ్చు అంటూ ఆమె అతడిని కౌగిలిలో బంధించింది.
అతడు వ్రాసిన " ఉండిపోరాదే" అనే కథ స్మార్ట్ ఫోన్ యాప్ లోంచి వారిద్దరినీ తొంగి చూసింది.